Sunil Deodhar Warns : ఏడుకొండలుతో పెట్టుకుంటే ఇక అంతే
బీజేపీ సీనియర్ నేత సునీల్ దియోధర్
Sunil Deodhar Warns : భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని(CM Jagan) టార్గెట్ చేశారు. ఏ స్థాయిలో ఉన్నా సరే తప్పు చేస్తే జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఆయన సీఎంను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇదే జరుగుతోందని చెప్పారు.
ఒకవేళ సీఎం జగన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలినా లేక తప్పు చేసినట్లు బయట పడినా జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు సునీల్ దియోధర్. వివేకా హత్య కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత దూకుడు పెంచిందన్నారు. తన పని తాను చేసుకు పోతోందని స్పష్టం చేశారు. కేంద్రం పై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు సునీల్ దియోధర్(Sunil Deodhar Warns).
కేంద్ర దర్యాప్తు సంస్థలకు కులం, మతం, రాజకీయాలు అన్నవి ఉండవన్నారు. తమ పనులు తాము చేసుకుంటూ పోతాయని పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉంటేనే రంగంలోకి దిగుతుందన్నారు. ఉన్నాయి కాబట్టే సీబీఐ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఫ్యాక్షన్ సర్కార్ గా ఇప్పటికే పేరు పొందిందని మండిపడ్డారు. ఈ పార్టీతో బీజేపీ కలిసిందన్న ప్రచారాన్ని సునీల్ దియోధర్ కొట్టి పారేశారు. ఇక ఆ శ్రీ వేంకటేశ్వరుడితో ఎవరు పెట్టుకున్నా నామ రూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు.
Also Read : గాడి తప్పిన జగన్ పాలన