Sunil Gavaskar : మీ క్రికెట్ చూసుకోండి మాకు చెప్పకండి
ఆసిస్..ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులపై సన్నీ ఫైర్
Sunil Gavaskar : మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టు క్రికెట్ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు జోక్యం చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మీ క్రికెట్ ను చూసుకోండి. ఏం చేయాలో మాకు చెప్పకండి అంటూ ఘాటుగా విమర్శలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ కు ఐపీఎల్ విఘాతం కలిగిస్తోందంటూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు నిందలు వేశాయి.
దీనిపై సీరియస్ గా స్పందించాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar). ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ , ఇంగ్లండ్ ది హండ్రెడ్ షెడ్యూల్ తో విభేదించే చాన్స్ ఉంది.
దీంతో యూఏఈ, దక్షిణాఫ్రికా లలో రాబోయే టి20 లీగ్ లలో బహుళ ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు జట్లను కొనుగోలు చేయడంతో ఐపీఎల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దీనిపై నోరు జారిన ఆసిస్, ఇంగ్లండ్ క్రికెటర్లు, బోర్డులను తప్పు పట్టాడు. భారత క్రికెట్ కార్యకలాపాలలో జోక్యం చేసుకోవద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గవాస్కర్.
క్రికెట్ విషయంలో మేం మీకంటే ముందంజలో ఉన్నాం. ఎవరి ప్రయోజనాలు వారివి. ఏదైనా ఆటతో పాటు ఆదాయం కూడా కావాలి. నిర్వహణ ఖర్చు ఇటీవల భారీగా పెరిగింది.
మీ కంటే క్రికెట్ ను ఎలా వినియోగించు కోవాలో భారత్ చెప్పించుకునే స్థితిలో లేదన్నాడు సన్నీ. గతంలో ఉన్న క్రికెట్ వేరు. ఇప్పుడు ఆయా దేశాలు తమకు అనుకూలంగా ఉండేలా క్రికెట్ షెడ్యూల్ ఉండాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నాడు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 26 పతకాలు