YS Sunitha : హైకోర్టు ఉత్త‌ర్వుల‌పై సునీత పిటిష‌న్

ఎంపీ అవినాష్ రెడ్డికి కోలుకోలేని షాక్

YS Sunitha :  ఇరు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య(YS Viveka Case) . ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకు కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. మ‌రో వైపు బాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న జైలులో ఉన్నారు.

ఇదే కేసులో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తోంది సీబీఐ. త‌న‌ను ముంద‌స్తు అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు గాను ఎంపీ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఏప్రిల్ 25 వ‌ర‌కు ఎలాంటి అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ సీబీఐని ఆదేశించింది.

ఇందుకు సంబంధించి కోర్టు కీల‌క సూచ‌న‌లు కూడా చేసింది. ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ వ‌ద్ద‌ని, విచార‌ణ జ‌రిగే స‌మ‌యంలో ఆడియోను, వీడియోను రికార్డింగ్ చేయాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా కోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది.

కాగా ఎంపీ అవినాష్ రెడ్డికి ఊర‌ట నిచ్చేలా హైకోర్టు తీర్పు ఇవ్వ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది దివంగ‌త వివేకానంద రెడ్డి కూతురు సునీత‌(YS Sunitha). ఈ మేర‌కు ఆమె సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈనెల 21న ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని కోర్టు తెలిపింది. దీంతో మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైంది ఎంపీలో.

Also Read : చంద్ర‌బాబూ క‌ల‌కాలం వ‌ర్ధిల్లు

Leave A Reply

Your Email Id will not be published!