Supreme Court: ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరం – సుప్రీంకోర్టు

ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరం - సుప్రీంకోర్టు

Supreme Court : బిహార్‌ లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు సెప్టెంబర్ ఒకటి డైడ్‌లైన్‌ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బిహార్‌ లీగల్‌ సర్వే అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court Shocking Comments

సెప్టెంబర్ 30 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీవరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకు (Supreme Court) ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇదే విషయాన్ని కోర్టు పిటిషనర్ల వద్ద ప్రస్తావించింది. కాగా.. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదా జాబితాను ఆగస్టు 1న ఈసీ విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతోపాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా తెలియజేయాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపైనే తాజా విచారణ జరిగింది. ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈసీ తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు పౌరసత్వంపై అనుమానాలున్న3లక్షల మందికి నోటీసులు పంపించినట్లు తెలిపింది.

Also Read : Mumbai: ముంబయి వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి – బాంబే హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!