Supreme Court : నీరా రాడియా టేప్లపై సుప్రీం ఆదేశం
స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీబీఐకి
Supreme Court : నీరా రాడియా టేప్ లకు సంబంధించిన కేసులో బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది.
రాడియా టేపులకు సంబంధించి గోప్యత హక్కును కాపాడాలని కోరుతూ పారిశ్రామికవేత్త రతన్ టాటా(Ratan TATA) పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల అక్టోబర్ 12న విచారించనుంది. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా సంభాషణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
వచ్చే వారం రాజ్యాంగ ధర్మాసనం ఉంది. సీబీఐ స్థితి నివేదికను దాఖలు చేయవచ్చంటూ న్యాయమూర్తులు హిమా కోహ్లీ, పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వరయ భాటి సుప్రీంకోర్టుకు(Supreme Court) సంబంధించిన గోప్యతా హక్కు తీర్పు నేపథ్యంలో పిటిషన్ ను పరిష్కరించ వచ్చని సమర్పించారు.
2017లో సుప్రీంకోర్టు తన తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. ఈ సంభాషణలు అన్నింటిని దర్యాప్తు చేయమంటూ సీబీఐని ఆదేశించండి. 14 ప్రాథమిక హక్కులు విచారణ కు సంబంధించి నమోదు చేయబడ్డాయి.
నివేదికను సీల్డ్ కవర్ లో మీ ముందు ఉంచాం. ఇందులో ఎలాంటి నేరం కనుగొనబడలేదు. ఇదిలా ఉండగా ప్రారంభంలో టాటా తరపు న్యాయవాది వాయిదా వేయాలని కోరారు.
సీసీఐఎల్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు. రాడియా రెండు ముఖ్యమైన కంపెనీలకు కార్పొరేట్ లాబీయిస్ట్ అని, పబ్లిక్ వ్యక్తులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడైంది.
Also Read : పే సీఎం’ బొమ్మై పోస్టర్ల కలకలం