Delhi LG Return Files : కోర్టు ఎఫెక్ట్ ఫైల్స్ పంపిన ఎల్జీ

ఢిల్లీ ప్ర‌భుత్వానికి చేర‌వేత

ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే సుప్రీంకోర్టు కేంద్రం, వ‌ర్సెస్ ఢిల్లీ స‌ర్కార్ కు మ‌ధ్య ఎవ‌రికి ఏయే అధికారాలు ఉంటాయ‌నే దానిపై స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. ఢిల్లీకి సంబంధించి ఎల్జీకి కేవ‌లం శాంతి భ‌ద్ర‌త‌లు, భూ సంబంధ వ్య‌హారాలు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని అది ప్ర‌భుత్వం కోరితేన‌ని స్ప‌ష్టం చేసింది. మిగ‌తాదంతా ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందుతుంద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం.

తాజాగా కోర్టు ఆదేశాల త‌ర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సేవ‌ల‌కు సంబంధించిన ఫైల్స్ ల‌ను ఢిల్లీ ప్ర‌భుత్వానికి తిరిగి పంపారు. ఢిల్లీలో ఎన్నికైన ప్ర‌భుత్వానికి భూమి, పోలీస్ , ప‌బ్లిక్ ఆర్డ‌ర్ ల‌కు సంబంధించినవి కాకుండా సేవ‌ల శాఖ వ్య‌వ‌హారాల‌పై శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క అధికారాలు ఉన్నాయ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించింది. సేవ‌ల విష‌యాల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను ఎల్జీ సెక్ర‌టేరియ‌ట్ తిరిగి ఇచ్చింది.

ఇక న‌గ‌రంలో బ్యూరోకాట్ల బ‌దిలీలు, పోస్టింగ్ లై సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సేవ‌ల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను ప్ర‌భుత్వానికి పంపిన‌ట్లు రాజ్ నివాస్ మంగ‌ళవారం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఫైళ్ల‌లో ఢిల్లీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో సిబ్బంది ఒప్పంద ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌డం , దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ ఆస్ప‌త్రికి చెందిన గ్రూప్ – ఎ సిబ్బంది రాజీనామాను ఆమోదించ‌డం వంటి ప్రతిపాద‌న‌లు ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!