Kiren Rijiju : రాజ్యాంగాన్ని సుప్రీం హైజాక్ చేస్తోంది

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రిజిజు ఫైర్

Kiren Rijiju : కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టుకు మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుతో పాటు ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ద‌న్ ఖ‌ర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. మ‌రో అడుగు ముందుకేసి కిరెన్ రిజిజు(Kiren Rijiju)  కొలీజియం వ్య‌వ‌స్థ‌లో కేంద్రానికి సంబంధించిన ప్ర‌తినిధి ఉండాల‌ని ప్ర‌తిపాదించారు.

ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కు లేఖ రాశారు. ఇది తీవ్ర సంచ‌ల‌నం రేపింది. ఆదివారం మ‌రో షాకింగ్ కామెంట్స్ చేశారు కిరెన్ రిజిజు. భార‌త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు హైజాక్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో తాము రాజ్యాంగానికి అతీతంగా ఉన్నామ‌ని భావించే వారిని టార్గెట్ చేశారు. ఇది ఒక ర‌కంగా హైజాక్ చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. కొలీజియం వ్య‌వ‌స్థ‌పై మాజీ న్యాయ‌మూర్తి ఒక‌రు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) .

ఇవాళ లా స్ట్రీట్ భార‌త్ యూట్యూబ్ ఛానెల్ తో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను సుప్రీంకోర్టు నియ‌మించుకుంటుంది. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి పాత్ర ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు కిరెన్ రిజిజు.

హైకోర్టులు సుప్రీంకోర్టుకు లొంగవు..కానీ హైకోర్టు న్యాయ‌మూర్తులు మాత్రం సుప్రీంకు లొంగి పోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కిరెన్ రిజిజు. న్యాయ వ్య‌వ‌స్థ స్వ‌తంత్ర‌మైన‌ది..కానీ మన రాజ్యాంగం అత్యున్న‌త‌మైన‌ద‌ని పేర్కొన్నారు.

Also Read : మోడీ బీబీసీ డాక్యుమెంట‌రీ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!