Sidhu Supreme Court : సిద్దూకు షాక్ ఏడాది జైలు శిక్ష
తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు
Sidhu Supreme Court : పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనకు ఈ ఏడాది కలిసి రానట్టుంది. ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
1988లో రోడ్డుపై జరిగిన ఘర్షణ కేసు విచారణలో ఈ శిక్ష పడింది సిద్దూకు. ఆనాటి ఘటనపై విచారించిన కోర్టు సిద్దూ నేరస్థుడని ధ్రువీకరించింది.
ఈ మేరకు తీర్పు ప్రకటించింది. ఆ ఏడాది డిసెంబర్ 27న పాటియాలా లోని షెరన్ వాల్ గేట్ దగ్గర రోడ్డు మధ్యలో జిప్సీలో సిద్దూ(Sidhu Supreme Court) , ఆయన స్నేహితుడు రూపిందిర్ సింగ్ ఉన్నారు.
ఇదే సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ తో కలిసి డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళుతుండగా అడ్డంగా ఉన్న జిప్సీని తొలగించమని కోరాడు. దీంతో సిద్దూ, ఫ్రెండ్ గుర్నామ్ సింగ్, స్నేహితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదే క్రమంలో సిద్దూ రెచ్చి పోయి గుర్నామ్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గుర్నామ్ చని పోయాడంటూ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆనాడు సుప్రీంకోర్టు నిర్దోషిగా 2018లో ప్రకటించింది. 1000 రూపాయల జరిమానా విధించింది.
ఈ తీర్పును గుర్నామ్ సింగ్ కుటుంబీకులు ఒప్పుకోలేదు. కచ్చితంగా సిద్దూ(Sidhu Supreme Court) వల్లే చని పోయాడంటూ మరోసారి సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం సిద్దూను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Also Read : వారణాసి కోర్టు విచారణపై స్టే