Supreme Court : కేంద్ర సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు
ఈడీ, సీబీఐ పదవీ కాలం పొడిగింపుపై
Supreme Court : మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ చీఫ్ ల పదవీ కాలం పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లై కేంద్రానికి నోటీసులు పంపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ లు తీసుకు వచ్చింది.
దీనిపై సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు(Supreme Court) జారీ చేసింది. 10 రోజుల తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
నవంబర్ 15, 2021 ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం , ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టానికి సీబీఐ, ఈడీల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన దావాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ మేరకు వెంటనే స్పందించాలని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్డినెన్స్ ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని నియంత్రించే సీవీసీ చట్టంలోని సెక్షన్ 25ని సవరించింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా, టీఎంసీ ఎంపీ మెహూవా మోయిత్రా , సాకేత్ గోఖలేలు పిటిషన్లు దాఖలు చేశారు.
ఐఆర్ఎస్ అధికారి అయిన ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు మేలు చేకూర్చేందుకే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందంటూ ఆరోపించారు పిటిషన్లలో. ఈ కేసుకు సంబంధించి వాదనలు బలంగా జరిగాయి. చివరకు నోటీసులు జారీ చేసంత దాకా వెళ్లింది.
Also Read : నేషనల్ హెరాల్డ్..ఏజీఎల్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు