Supreme Court of India : అన్ని మతాల ఉమ్మడి శత్రువు ద్వేషం
ద్వేష పూరిత ప్రసంగంపై సుప్రీంకోర్టు
Supreme Court of India : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014 తర్వాత దేశంలో పెద్ద ఎత్తున విద్వేష పూరితమైన ప్రసంగాలు ఎక్కువయ్యాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. మతాల ఉద్దేశం ఒక్కటే అంతా బాగుండాలని. కానీ ఇవాళ మా మతం గొప్పదని కొట్టుకు చస్తున్నారు. ఈ తరుణంలో విద్వేష పూరిత ప్రసంగాలు దేశానికి మేలు చేకూర్చవు..మరింత చేటు తెచ్చేలా చేస్తాయని మండిపడింది ధర్మాసనం.
ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్ని మతాల ఉమ్మడి శత్రువు ద్వేషం మాత్రమేనని స్పష్టం చేసింది. ద్వేష పూరిత ప్రసంగానికి నిర్వచనం ఏదీ లేదు. దాని వివరణ కోసం భారత శిక్షాస్మృతి లోని అనుబంధ రూల్స్ పై ఆధారపడాల్సి ఉంటుందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించింది ధర్మాసనం(Supreme Court of India).
2014లో దాఖలైన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విచారణను నిలిపి వేస్తున్నట్లు న్యాయమూర్తులు కేఎం జోసెఫ్ , బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రెండు రోజుల కిందట పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ఇలా అన్నారు.
అదేమిటంటే ఖుదాను నమ్మే వారు బీజేపీకి ఓటు వేస్తే ఖుదా క్షమించదని . హర్యానా లోని మేవాత్ లో భజరంగ్ దళ్ సభ్యులు ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వ్యతిరేకంగా దాఖలైన కేసులపై కూడా వచ్చే నెల మార్చి 21న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మన నాగరికత జ్ఞానం శాశ్వతమైనదని జోసెఫ్ పేర్కొన్నారు.
Also Read : సంసద్ అవార్డుకు 13 మంది ఎంపిక