Supreme Court: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలకు ‘సుప్రీం’ నో
తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలకు ‘సుప్రీం’ నో
Supreme Court : సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ఈ విచారణ సందర్భంగా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించడంపై ఆయా గ్రామాల గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి.. నిజాం ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడంపై స్థానికులు సుప్రీంకోర్టును (Supreme Coourt) ఆశ్రయించారు.
Also Read : Indian Student: రష్యా సైన్యంలో బందీగా మారిన భారతీయ విద్యార్ధి
తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించవద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్లో మంగపేట మండలంలో 23 గ్రామాలు లేవని గిరిజనేతరుల తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ స్టే ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మంగపేట పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపైనా స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court Reject
ఆ గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గతంలో తెలంగాణ హైకోర్ట్ (HIgh Court) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సవాల్ చేశారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్‌లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని 2013లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే, నిజాం ఆర్డర్ ఆధారంగా ట్రైబల్ గ్రామాలుగా పరిగణించాలని ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు నాన్ ట్రైబల్స్. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్‌లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి.
Supreme Court – హైకోర్టును ఆశ్రయించిన స్మితా సభర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును (High Court) ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె… ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా… పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సభర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read : Indian Student: రష్యా సైన్యంలో బందీగా మారిన భారతీయ విద్యార్ధి
