Supreme Court: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను కాపాడేందుకు ‘ఫండ్‌’

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను కాపాడేందుకు ‘ఫండ్‌’

Supreme Court : పన్ను చెల్లించే మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది సొంతింటి కలలు సాకారం కాకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అటువంటి వాటిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధి’ ఏర్పాటుపై ఆలోచన చేయాలని, అలాంటి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడాన్నీ పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

నివాస ప్రాజెక్టు విషయంలో ఓ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం (Supreme Court) విచారించింది. రియల్‌ డెవలపర్ల చేతిలో గృహ కొనుగోలుదారులు మోసపోకుండా లేదా దోపిడీకి గురికాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకునేందుకు ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి, దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. దేశ పట్టణీకరణ విధానాలకు అనుగుణంగా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేలా చూడాలని స్పష్టం చేసింది.

Supreme Court : మౌన ప్రేక్షకుడిగా ఉండొద్దు – సుప్రీంకోర్టు

రెరా ను ‘కోరలు తీసిన పులి’గా మార్చొద్దని, అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రైబ్యునళ్లు, సమర్థమంతమైన యంత్రాంగం ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అప్పుడే వారి ఆదేశాలు వేగంగా, కచ్చితంగా అమలు అవుతాయని అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వం మౌనప్రేక్షకుడిగా ఉండకూడదని హితవు పలికింది. గృహ కొనుగోలుదారులు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. నిలిచిపోయిన ప్రాజెక్టులను గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (NARCL) లేదా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో ఓ సంస్థను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది.

Also Read : IPS Transfers: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం

Leave A Reply

Your Email Id will not be published!