Supreme Court Rejects : నారాయణ రాణెకు సుప్రీంకోర్టు షాక్
అక్రమ నిర్మాణల కూల్చివేత సబబే
Supreme Court Rejects : నరేంద్ర మోదీ కేబినెట్ లో ఆయన మంత్రి. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాడు. కానీ తానే గతి తప్పాడు. ఆపై కోర్టుకు ఎక్కాడు. దీనిపై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court Rejects) బిగ్ షాక్ ఇచ్చింది.
అక్రమ నిర్మాణాలకు తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమంటూ స్పష్టం చేసింది. ఇక వివరాలలోకి వెళితే మహారాష్ట్రలోని ముంబై బంగ్లా లోని కొన్ని భాగాలను కూల్చే వేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నారాయణ రాణే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొన్నారు. తనకు అన్యాయం జరిగిందంటూ చిలుక పలుకులు పలికారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బాంబే హైకోర్టు సీరియస్ అయ్యింది.
పురపాలక చట్టాలను ఉల్లంఘించినందుకు నారాయణ రాణేకు(Narayan Rane) చెందిన ఎనిమిది అంతస్తుల కుటుంబ బంగ్లాను కూల్చి వేయాలంటూ ఆదేశించింది. వెంటనే ఆపని చేపట్టాలంటూ స్పష్టం చేసింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) , ఇతర చట్టాలను ఉల్లంఘించారంటూ ముంబైలోని ఎనిమిది అంతస్తుల కుటుంబ బంగ్లా లోని అనధికార భాగాలను కూల్చి వేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఎక్కారు కేంద్ర మంత్రి నారాయణ రాణే. ఇదిలా ఉండగా నారాయణ్ రాణే పిటిషన్ ను సర్వోన్నత న్యాయ స్థానం సోమవారం తోసిపుచ్చింది.
జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన డివిజెన్ బెంచ్ తీర్పు చెప్పింది. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి ఇలా వ్యవహరిస్తారా అంటూ మండిపడింది ధర్మాసనం.
Also Read : సత్యేందర్ జైన్ కేసు విచారణ