Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court : వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ నెల 11 ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేబిస్‌, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేదించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం అందించవద్దని, ఇందుకోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించింది. రేబిస్‌ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాత విడుదల చేయాలని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సవరించింది.

Supreme Court Key Verdict on Street Dogs

దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటి దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీం ధర్మాసనం (SUpreme Court) దిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదంటూ తీర్పు చెప్పింది. వీటిని షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మునుపటి తీర్పును సవరిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ నుంచి తరలించిన వీధి కుక్కలను మళ్లీ వాటి స్థానాల్లోనే వదిలి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ.. గతంలో జస్టిస్ పార్ధీవాలా ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం నిలిపివేసింది. కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధమని చెప్పుకొచ్చింది. కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో ఆహారం పెట్టాలని సూచించింది. వాటి కోసం డాగ్ లవర్స్, ఎన్‌జీఓలు రూ.25,000–2 లక్షలు జమ చేయాలని తెలిపింది. వీధి కుక్కల విషయంలో అధికారుల పనికి ఎవరూ అడ్డుపడొద్దని పేర్కొంది. ఈ అంశంపై 8 వారాల తర్వాత మళ్లీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Also Read : Artificial Intelligence: బెంగాల్‌ జైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమరాలు ఏర్పాటు

Leave A Reply

Your Email Id will not be published!