Supreme Court: ‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court : ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య అనంతరం అతనికి చెందిన స్థిరాస్తులు, నిర్మాణాలను యోగి ప్రభుత్వం బుల్డోజర్ తో కూల్చిన ఘనపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా విచారణ సందర్భంగా బూల్డోజర్‌ చర్యలపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి(CM Yogi Adityanath) సర్కార్‌ తో పాటు ప్రయాగ్‌రాజ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని అని వ్యాఖ్యానించింది. ఈ ఘటన మా మనస్సాక్షిని షాక్‌ కు గురిచేస్తున్నాయి. ‘‘దేశంలో రూల్‌ ఆఫ్‌ లా ఒకటి ఉంది. ఈ తరహాలో నివాస భవనాల కూల్చివేత ఒక ఫ్యాషన్‌ కాకూడదు. బాధితులకు ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి’’ అని ప్రయాగ్‌రాజ్‌ లో అక్రమ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ అభయ్‌ ఓక్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.

Supreme Court Slams UP Govt

అంతేకాదు పిటిషనర్ల ‌ ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌(UP) లోని అంబేద్కర్ నగర్‌ లో బుల్డోజర్‌ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్‌ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్‌ తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌ కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. దీనితో ప్రభుత్వం తమ ఆస్తులను బుల్డొజర్లతో అక్రమంగా కూల్చేసిందంటూ బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో బుల్డోజర్లు తమ పూరిల్లుపైకి దూసుకొస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలిక ఇంట్లోంచి తన పుస్తకాలు తీసుకుని పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తిలకించిన ద్విసభ్య ధర్మాసనం… అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అది మా పొరపాటే – ప్రయాగ్‌రాజ్‌ అధికారులు

అంతకుముందు అడ్వకేట్‌, ప్రొఫెసర్‌ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్‌ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.

రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదు – కోర్టు

కూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్‌ ఎస్‌.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read : PM Narendra Modi: చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ ఫాంట్‌ తో ప్రధాని మోదీ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!