Supreme Court: కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ కేసులో గుజరాత్ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం

కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ కేసులో గుజరాత్ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court : కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి పై అక్రమ కేసు నమోదు చేసారంటూ గుజరాత్‌ పోలీసులపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే… ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే’’ అని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది. కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి(Imran Prathapgarhi) వివాదాస్పద వీడియో పోస్ట్‌కు సంబంధించిన కేసుపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్‌ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి అని స్పష్టంచేసింది.

Supreme Court Slams

కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి(Imran Prathapgarhi) విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం… గుజరాత్‌ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఎలాంటి నేరం లేకపోయినా… అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈసందర్భంగా వాక్‌ స్వాతంత్ర్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలు, సాహిత్యం వంటివి మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు… ఆర్టికల్‌ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం అసాధ్యం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో… విభిన్న అభిప్రాయాలను… ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే… అవి సహేతుకంగా ఉండాలే గానీ… ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే… ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. వాక్‌ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం న్యాయస్థానాల విధి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసులో కాంగ్రెస్‌ ఎంపీపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.

అసలేం జరిగిందంటే ?

గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి తన ఎక్స్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 46 సెకన్ల నిడివి ఉన్నా వీడియోలో ఇమ్రాన్‌ ఓ పెళ్లి వేడుక మధ్యలో నడిచివస్తుండగా ఆయనపై పూలవర్షం కురిసింది. బ్యాక్‌ గ్రౌండ్‌ ఓ పద్యం వినిపించింది. అయితే, ఆ పద్యంలోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది. దీనితో ఈ కేసును కొట్టివేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా… ఆయన పిటిషన్‌ ను న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం… గుజరాత్‌ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఎలాంటి నేరం లేకపోయినా… అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది.

Also Read : Mamata Banerjee: యూకే పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేదు అనుభవం

Leave A Reply

Your Email Id will not be published!