Supreme Court-Illegal Immigrants : అస్సాం సర్కార్ పై సుప్రీంకోర్టు గరం
ఈ క్రమంలో సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది...
Supreme Court : అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతూ, వారిని తమ దేశాలకు తిరిగి పంపి, స్థానిక అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, భారత్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారిని వెనక్కి పంపించకుండా కాలయాపన చేస్తున్న అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అమెరికాలో వీసా గడువు ముగిసిన వారితో పాటు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని, వారు స్థానిక ప్రజల అవకాశాలను ఆక్రమించడమే కాక, అమెరికా ప్రభుత్వం వారిని వెనక్కి పంపించడాన్ని ప్రారంభించిందని ఈ సందర్భంలో చెబుతారు. ఆమేరికా దేశంలో అక్రమంగా ఉన్న 18,000 భారతీయులను గుర్తించి, 205 మందిని ప్రత్యేకంగా విమానంలో పంపించినట్లు నివేదికలు ఉన్నాయి.
Supreme Court Slams Assam Govt…
భారతీయులు ప్రపంచవ్యాప్తంగా “మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ”గా పరిగణించబడతారు. భారతీయులు ఎక్కడున్నా, ఆ దేశాల చట్టాలను, సంస్కృతిని గౌరవిస్తూ తమ ప్రత్యేకతను ఉంచుకుని జీవిస్తారు. వారి వల్ల ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని చెప్పవచ్చు. కానీ, పాకిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాక్ వంటి మధ్య ఆసియా దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులు, తమ ధోరణిని మారుస్తూ, అక్కడి సమాజంలో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, అక్రమ మార్గాల్లో వలస వచ్చిన భారతీయుల విషయంలో భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధమైంది. కానీ, భారత్‌లో అక్రమంగా ప్రవేశించినవారిపై చర్యలు తీసుకోవడంలో గణనీయమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది.
సుప్రీంకోర్టు(Supreme Court) జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సమక్షంలో, అక్రమ చొరబాటుదారులను వెంటనే వెనక్కి పంపకుండానే, వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచడం అనేది చట్టవిరుద్ధమని అన్నారు. అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తించి, వారికి మరింత కాలం డిటెన్షన్ సెంటర్లలో ఉండే అవకాశం ఇవ్వడం చెల్లదని, వారు ఎక్కడి వారు, వారి చిరునామా తెలిసినంత వరకు వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలలో అక్రమ వలసదారుల సమస్య తీవ్రమవుతోంది. సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన ఈ అంశం, అస్సాం ప్రభుత్వం స్పందించకపోవడాన్ని గమనించింది. “వారి చిరునామా తెలియకపోవడం అంగీకరించలేము. వారు ఎక్కడి వారు అనేది మనకు తెలుసు. వారి దేశాలకు వారిని పంపించండి” అని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి, మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read : Delhi Elections 2025 : నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…