Supreme Court :తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Supreme Court : తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ ఆర్ ఎన్ రవిపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్టు(Supreme Court) న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RV Ravi) తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవికుమార్ ను ఆదేశించింది. గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది.
Supreme Court Shock to Tamil Nadu Governor
ఈ సందర్భంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత, రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. బిల్లులను గవర్నర్ నిరవిధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని, ఏకపక్షమని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ ఆమోదించిన పదికి పైగా బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) అడ్డుకుంటున్నారని, నిరవధికంగా జాప్యం చేస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని ఆ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మంగళవారంనాడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.
గవర్నర్లపై సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం – స్టాలిన్
గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు. రాష్ట్ర బిల్లులపై గవర్నర్ పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సీఎం స్టాలిన్ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, ఇది అన్ని రాష్ట్రాలు సాధించిన విజయమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు.
అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ కాదనలేరని రాజ్యాంగం చెబుతోందని, అయితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, ఎడతెగని జాప్యం చేస్తూ వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రాలకున్న లెజిస్లేటివ్ హక్కులను పునరుద్ఘాటించే తీర్పు ఇదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్లు… విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రగతిశీల లెజిస్లేజివ్ సంస్కరణలను అడ్డుపడే సంస్కృతికి ఈ తీర్పు ఫుల్‌స్టాప్ పెట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య సమతుల్యతను పునరుద్ధించడంలో కీలకమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తమిళనాడు ప్రజలకు, లీగల్ టీమ్‌కు అభినందలు తెలిపారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్థానం
సీబీఐలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్. రవి 2021లో తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వంతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. దీనితో డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చింది. గవర్నర్ ఆర్ రవి బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండి పడింది. కావాలనే రాష్ట్ర శాసనసభ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం , నియామకాలపై అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తింది. అయితే, గవర్నర్ రవి మాత్రం తనకు రాజ్యాంగం అందించిన అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానంటూ సర్థించుకున్నారు.
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
గవర్నర్ తన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది, గవర్నర్ ప్రారంభపు ఉపన్యాసం సందర్భంగా జాతీయ గీతం పాడకపోవడంపై గవర్నర్ టీఎన్ రవి నిరసనగా సభనుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం ప్రసంగం ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వళ్తు’ అనే రాష్ట్ర గీతం పాడడం, ముగింపులో జాతీయ గీతం పాడటం జరుగుతుంది. కానీ గవర్నర్ రవి మాత్రం ప్రారంభంలోను, ముగింపులోను జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని అభిప్రాయపడ్డారు.
గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా మారిన వివాదం
2023లో గవర్నర్ అసెంబ్లీకి రాసిన సంప్రదాయ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఉన్న విషయాలు నిజానికి భిన్నంగా ఉన్నాయన్నారు. అంతకంటే ముందు ఏడాది, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేరియార్, సి.ఎన్. అన్నాదురై పేర్లు, ‘ద్రవిడ మోడల్’ అనే పదబంధం, రాష్ట్రంలోని చట్టం, శాంతి పరిపాలన గురించి మాట్లాడకుండా వదిలేశారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్ విషయంలో తాము చేస్తున్న పోరాటానికి ఫలితంగా దక్కిందని ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
Also Read : Kunal Kamra: బాంబే హైకోర్టులో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు స్వల్ప ఊరట