Supreme Court : జ్ఞాన్ వాపి సర్వే కేసుపై సుప్రీం కామెంట్స్
పిటిషన్ ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Supreme Court : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన యూపీలోని వారణాసి సిటీ లోని జ్ఞాన్ వాపి మసీదు సర్వే కు సంబంధించిన కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సర్వే అభ్యంతర పిటిషన్ పై వాడి వాడిగా వాదనలు జరిగాయి.
మొత్తం విన్న త్రిసభ్య ధర్మాసనం దీనిని సున్నితమైన అంశంగా పేర్కొంది. ఈ మేరకు దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయబోమంటూ స్పష్టం చేసింది.
ఇదే సమయంలో శివ లింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజు కొనసాగించాలంటూ ఇప్పటికే కింది కోర్టు(Supreme Court) జారీ చేసిన ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
కాగా అనుభవం, విషయం తెలిసిన జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పిటిషన్ ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
ఇదే సమయంలో జ్ఞాన్ వాపి మసీదు సర్వేకు సంబంధించిన నివేదిక బయటకు పొక్కడంపై సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ లీకులు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు జస్టిస్ డీవై చంద్రచూడ్.
మొత్తంగా ఈనెల 23న వారణాసి ఈ కేసును విచారించనుంది. జ్ఞాన్ వాపి మసీదు సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వారణాసి ఆదేశించిన మేరకు సర్వే రిపోర్టును తెరవవద్దని, తాము ఆదేశించేంత వరకు ఎలాంటి ముందస్తు విచారణ చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది కింది కోర్టును. చివరకు మళ్లీ వారణాసి కోర్టుకే బదిలీ చేయడంతో తుది తీర్పు వెలువడే చాన్స్ ఉంది.
Also Read : భాషపై వివాదం మోదీ ఆగ్రహం