Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !
ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !
Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఎంపీ, ఎమ్మెల్యేలకు… లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా సరే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. అంతేకాదు చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది అని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court Comment
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో రాజ్యాంగ రక్షణ అంశంపై నేడు సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(Supreme Court)… 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు కేసులో ఇమ్మ్యూనిటి కల్పిస్తూ ఇచ్చిన మెజారిటీ న్యాయవాదులు వెల్లడించిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు లంచం తీసుకోవడమే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
Also Read : AP Employees : జీఓ నెం11 అమలుకు గ్రామా వార్డు సచివాలయాల ఉద్యోగుల డిమాండ్