Supreme Court : ఏఎంయూ విద్యా సంస్థ మైనారిటీ హోదా పై సుప్రీం కీలక తీర్పు

కాగా చీఫ్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు...

Supreme Court : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనారిటీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూకి మైనారిటీ హోదాను తొలగిస్తూ 1967లో ఇచ్చిన తీర్పును న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనం 4:3 అనుకూల తీర్పు ఇచ్చింది. అయితే మైనారిటీ హోదా కల్పించే అంశంపై తుది నిర్ణయాన్ని మరో బెంచ్‌కు అప్పగిస్తూ ధర్మాసనం(Supreme Court) నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అంశంపై విచారణకు మరో బెంచ్ ఏర్పాటు కానుంది.

Supreme Court of India Order…

అలీఘర్ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వొద్దని తీర్పు ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జిస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మ… కాగా చీఫ్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పును చదివారు. ధర్మాసనంలో నాలుగు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. మెజారిటీ తీర్పును తానే స్వయంగా రాశానన్నారు. జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ వేర్వేరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని 1920లో స్థాపించారు. భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీ సంస్థగా గుర్తించవచ్చా లేదా అనే అంశం దీర్ఘకాలంగా వివాదాస్పద చర్చ నడుస్తోంది.

Also Read : Perni Nani : ఎమ్మెల్సీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ

Leave A Reply

Your Email Id will not be published!