Justice RS Sodhi : కొలీజియంపై ఆర్ఎస్ సోధి కామెంట్స్

రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం

Justice RS Sodhi : ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి ఆర్ఎస్ సోధి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వ‌ర్సెస్ న్యాయ వ్య‌వ‌స్థ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈ త‌రుణంలో కిరెన్ రిజిజు ప‌దే ప‌దే కొలీజియం వ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగాన్ని హైజాక్ చేసేలా ఉంద‌న్నారు.

అంతే కాదు ప్రపంచంలో ఎక్క‌డైనా న్యాయ‌మూర్తుల‌ను ప్ర‌భుత్వాలు నియ‌మిస్తాయ‌ని కానీ భార‌త దేశంలో న్యాయ‌మూర్తుల‌ను వారే నియ‌మించుకుంటున్నార‌ని దీనికి అంద‌మైన పేరు కొలీజియం అని పెట్టుకున్నారంటూ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర మంత్రికి పూర్తిగా వ‌త్తాసు ప‌లికారు ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గదీప్ ధ‌న్ క‌ర్. సుప్రీంకోర్టు కంటే పార్ల‌మెంట్ అత్యంత బ‌ల‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఈ త‌రుణంలో కిరెన్ రిజిజు భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. కొలీజియంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్ర‌తినిధి ఒక‌రు త‌ప్ప‌క ఉండాల్సిందేన‌ని దీనికి మీరు సమ్మ‌తి తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

దీనిపై ఇంకా సీజేఐ స్పందించ లేదు. స‌మాధానం ఇవ్వ‌లేదు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం లా స్ట్రీట్ యూట్యూబ్ ఛాన‌ల్ తో రిటైర్డ్ న్యాయ‌మూర్తి ఆర్ఎస్ సోధి(Justice RS Sodhi) మాట్లాడారు. కొలీజియం వ్య‌వ‌స్థ అనేది పూర్తిగా భార‌త రాజ్యాంగానికి విరుద్ద‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : పుల్వామా.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్ నివేదిక ఎక్క‌డ

Leave A Reply

Your Email Id will not be published!