Anand Teltumbde : ఆనంద్ తెల్తుంబ్డే రిలీజ్ కు సుప్రీం ఓకే
పిటిషన్ ను కొట్టి వేసిన ధర్మాసనం
Anand Teltumbde : అకారణంగా వేధింపులకు గురి చేస్తూ, దేశ ద్రోహం కేసులతో ఇబ్బందులు పెడుతున్న ఎన్ఐఏకు కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇప్పటికే మావోయిస్టులో సంబంధాలు ఉన్నాయని జైలు పాలు చేసిన ఉద్యమకారుడు గౌతమ్ నవ్లాఖాకు బెయిల్ మంజూరు చేసింది.
మరో వైపు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్ తెల్తుంబ్డే కు(Anand Teltumbde) బెయిల్ ఇవ్వవద్దంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉండగా బాంబే హైకోర్టు బెయిల్ ఆర్డర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ అప్పీల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆనంద్ తల్తుంబ్డే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉండగా డిసెంబర్ 13, 2017న పూణే లోని భీమా కోరేగావ్ లో జరిగిన ఎల్గర్ పరిషత్ సమ్మేళనం జరిగింది. అందులో ఆవేశ పూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులో ఆనంద్ తేల్తుంబ్డే కు బెయిల్ మంజూరైంది. దీనికి వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టి వేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించేందుకు తాము ఇష్ట పడటం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 18న బాంబే హైకోర్టు బెయిల్ ఆర్డర్ ను పక్కన పెట్టాలన్న ఏజెన్సీ అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది. హైకోర్టు పరిశీలనలు విచారఫై ఎలాంటి ప్రభావం చూపబోవంటూ స్పష్టం చేసింది.
కాగా తేల్తుంబ్డేను ఏప్రిల్ 2020లో అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన ఉపా చట్టం కింద కేసు ఎదుర్కొంటున్నాడు. తలోజా జైలులో ఉన్నాడు.
Also Read : గవర్నర్ కు ఫడ్నవీస్ భార్య మద్దతు