Surat Court Rejects : రాహుల్ అభ్య‌ర్థ‌న కోర్టు తిర‌స్క‌ర‌ణ

కాంగ్రెస్ మాజీ చీఫ్ కు కోలుకోలేని షాక్

Surat Court Rejects : ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌కు నేరారోప‌ణ విష‌యంలో కాస్తా విరామం ఇవ్వాల‌ని కోరుతూ సూర‌త్ కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కోర్టు కొట్టి వేసింది. త‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసుకునే దాకా త‌న నేరారోప‌ణ‌కు విరామం ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు.

ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. 2019లో ఆయ‌న చేసిన మోదీ ఇంటి పేరు క‌లిగిన వారంతా ఆర్థిక నేర‌గాళ్లేన‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేర‌కు సూర‌త్ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. దీనిపై రాహుల్ గాంధీకి శిక్ష విధించింది.

గురువారం రాహుల్ గాంధీ చేసిన అభ్య‌ర్థ‌న‌ను గుజ‌రాత్ లోని కోర్టు(Surat Court Rejects) తిర‌స్క‌రించింది. అంటే రాహుల్ గాంధీని ప్ర‌స్తుతానికి తిరిగి పార్ల‌మెంట్ స‌భ్యునిగా చేర్చు కోవ‌డం సాధ్యం కాదు. త‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునే వ‌ర‌కు త‌న నేరారోప‌ణ‌కు విరామం ఇవ్వాల‌ని రాహుల్ గాంధీ కోరారు. అయితే కాంగ్రెస్ నాయ‌కుడు త‌న ప‌ట్ల క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఎంపీ హోదాతో ఎక్కువ‌గా ప్రభావితం అయ్యార‌ని పేర్కొంది.

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని నిరాక‌రించ‌డం ద్వారా రాహుల్ గాంధీకి కోలుకోలేని న‌ష్టం జ‌రుగుతుంద‌ని నిరూపించ‌డంలో రాహుల్ గాంధీ విఫ‌లం అయ్యార‌ని ట్ర‌య‌ల్ కోర్టు న్యాయ‌మూర్తి రాబిన్ మొగేరా పేర్కొన్నారు.

Also Read : న‌న్ను ట్రోల్ చేస్తారేమో – సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!