Suresh Babu : హైదరాబాద్ – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు(Suresh Babu). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమా పరిశ్రమకు చంద్రబాబు నాయుడు ఎంతగానో అభివృద్ది చేశారని వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బాబు వల్ల టాలీవుడ్ డెవలప్ కాలేదన్నారు.
Suresh Babu Shocking Comments
తెలుగు సినిమా కేవలం అభివృద్ది చెందింది ఇద్దరి వల్లనేనని పేర్కొన్నారు. మాజీ సీఎంలు, దివంగత మర్రి చెన్నారెడ్డి, నందమూరి తారక రామారావు కృషి చేశారని ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదన్నారు. ఇలాంటి ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని సూచించారు.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా ఎందుకని తెలుగు సినీ రంగానికి చెందిన వారు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు , సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.
Also Read : Chandrababu Naidu : మందుస్తు బెయిల్ పిటిషన్ వాయిదా