Suresh Raina UP Police : సురేశ్‌ రైనా అత్తామామల హత్య.. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఎన్‌కౌంటర్‌

Suresh Raina UP Police : టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామాలను దారుణంగా హత్య చేసిన దోపిడీ దొంగ, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసుల కళ్లుగప్పి మూడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న రషీద్‌ శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని ..ముజఫర్‌నగర్‌ పోలీసుల కంటపడ్డాడు. ఈక్రమంలో పోలీసులు(Suresh Raina UP Police) రషీద్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

వివరాల్లోకి వెళితే.. 2020 ఆగస్టు 19న పఠాన్‌కోట్‌ జిల్లాలోని తరైల్‌ గ్రామంలో సురైశ్‌ రైనా బంధువులను కొందరు దోపిడీ దొంగలు హతమార్చారు. రైనా మామ అశోక్ కుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాదాపు 12 మంది దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య ఆశారాణి, కుమారుడు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ కారణంగానే సురేశ్ రైనా ఐపీఎల్‌ ఆడకుండానే యూఏఈ నుంచి ఇండియాకు వచ్చేశాడు.

కాగా తన బంధువుల హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు రైనా ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. స్పందించిన సీఎం కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్నిఏర్పాటు చేశారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు. అతడి తలపై రూ. 50 వేల రివార్డు కూడా ఉంది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రషీద్‌ను తాజాగా ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్టు పోలీసులు(UP Police) తెలిపారు.

Also Read : కోల్‌కతాకు భారీ షాకిచ్చిన వరుణుడు.. పంజాబ్ విజయం

Leave A Reply

Your Email Id will not be published!