Veede Bala Book : సూర్య జోశ్యుల ‘వీడే బాలా’

ప్ర‌తి ఒక్క‌రు చ‌ద‌వాల్సిన పుస్త‌కం

Veede Bala Book : సినిమా రంగానికి సంబంధించి ఒక్కొక్క‌రిది ఒక్కో క‌థ‌. కొన్ని కంట‌త‌డి పెట్టిస్తాయి. మ‌రికొన్ని ఆలోచింప చేస్తాయి. ఇంకొన్ని ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోయేలా చేస్తాయి. సినిమా రంగానికి సంబంధించినంత వ‌ర‌కు కాస్తో కూస్తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు త‌మిళ ద‌ర్శ‌కుడు బాలా గురించి తెలిసే ఉంటుంది. మ‌రి ఈ బాలా ఎలా ద‌ర్శ‌కుడిగా మారాడు. అత‌డు తీసిన సినిమాలు కొన్నే అయినా దాని వెనుక బాలా ప‌డిన శ్ర‌మ ఏమిటో తెలుసు కోవాలంటే చేయి తిరిగిన ర‌చ‌యితగా పేరొందిన సూర్య ప్ర‌కాశ్ జోశ్యుల తెలుగులో అనువాదం చేసిన‌ పుస్త‌కం వీడే బాలా(Veede Bala Book) చ‌ద‌వాల్సిందే.

ప్ర‌తి ఒక్క‌రి లైబ్ర‌రీలో లేదా గ‌దిలో ఉండాల్సిన పుస్త‌కం. ప్ర‌ధానంగా త‌మిళ సినిమా రంగంలో ప్ర‌భావం చూపిన ద‌ర్శ‌కుల‌లో బాలా ఒక‌డు. త‌మిళ సినిమాకు రియ‌లిస్టిక్ సినిమాని ప‌రిచ‌యం చేసి జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు తెచ్చిన ద‌ర్శ‌కుడు. బాలా శివ పుత్రుడు సినిమా తీసిన త‌ర్వాత త‌మిళంలో విక‌ట‌న్ ప‌బ్లిష‌ర్స్ దీనిని ప్ర‌చురించింది. ఇందులో మొత్తం 21 భాగాలు ఉన్నాయి.

మొద‌టి భాగం బాలా జీవితం..ప్ర‌యాణం అయితే రెండో స‌గం సినీ ప్ర‌స్థానం గురించిన ప‌రిచ‌యం ఉంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఓ ప‌ల్లెటూరి పిల్ల‌గాడి కథ‌. బాలా అని పిల‌వ‌బ‌డే బాల‌సుబ్ర‌మ‌ణ్యం క‌థ‌. దీనిని జోశ్యుల ప‌బ్లికేష‌న్స్ ప్ర‌చురించింది. కావాల‌ని అనుకున్న వారు 97046 83520 నెంబ‌ర్ కు మెస్సేజ్ చేయొచ్చు. లేదంటే ఎమెస్కో, పుస్త‌కాల షాపులతో పాటు ఆన్ లైన్ లో లోగిలి లో కూడా దొరుకుతుంది.

Also Read : ప‌వ‌ర్డ్ న్యూస్ యాప్ ఆర్టి ఫ్యాక్ట్

Leave A Reply

Your Email Id will not be published!