Sushil Kumar Modi : తేజస్వి యాదవ్ పై సుశీల్ మోదీ ఫైర్
ఎవరికి ఆదరణ ఉందో జనానికి తెలుసు
Sushil Kumar Modi : బీహార్ లో డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన తేజస్వి యాదవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ. సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ డిప్యూటీ సీఎం చేయి పట్టుకోవడం తాను చూశానని పేర్కొన్నారు.
ఇదే సమయంలో సీఎం శరీర భాషను చూస్తే ఎవరు డి – ఫాక్టో సీఎం అనేది , ఎవరికి ఆదరణ లభిస్తుందో స్పష్టంగా తెలుస్తుందన్నారు సుశీల్ కుమార్ మోదీ.
ఇదిలా ఉండగా గత 17 ఏళ్లుగా జేడీయూ , బీజేపీ సంయుక్తంగా పాలన కొనసాగించింది. కానీ సుదీర్ఘ అనుబంధం తర్వాత కటీఫ్ చెప్పారు నితీశ్ కుమార్.
వెంటనే రాజీనామా చేయడం. 24 గంటలు పూర్తి కాకుండానే జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ తో కలిసి మహా కూటమి పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
విచిత్రం ఏమిటంటే నితీశ్ కుమార్ దేశానికి ఉప రాష్ట్రపతి కావాని అనుకున్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం. దానిని ఓ పెద్ద జోక్ గా పేర్కొన్నారు.
సుశీల్ కుమార్ మోదీ తేజస్వి యాదవ్ పై తీవ్రంగా దాడిని మొదలు పెట్టారు. యువ డిప్యూటీ సీఎం ను చూసి ఏదో ఒక రోజు సీఎం భయపడక తప్పదన్నారు.
ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా బలం చేకూరుస్తోందన్నారు. ఉద్యోగాల కల్పన హామీపై ఎద్దేవా చేశారు. ఏ రకంగా నిరుద్యోగులకు జాబ్స్ ఇస్తారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi).
కుర్చీ అలాగే ఉంటుంది. కానీ ఎవరు ఉంటారనేది చెప్పలేమన్నారు.
Also Read : దమ్ముంటే ఈడీ నా ఇంటికి రావచ్చు