TDP MLAs Suspended : బాలకృష్ణతో పాటు ఎమ్మెల్యేల సస్పెన్షన్
ప్రకటించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
TDP MLAs Suspended : నిత్యావసర వస్తువుల ధరలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగిన హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే(TDP MLAs Suspended) నందమూరి బాలకృష్ణతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు.
ఈ మేరకు శుక్రవారం శాసనసభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు రూలింగ్ ఇచ్చారు స్పీకర్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఇది రెండో రోజు.
ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమైంది సభ. ఏపీ పంచాయతీరాజ్ చట్టం, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బిల్లు, సివిల్ సర్వీసెస్ (రద్దు )బిల్లు, ఇండియన్ స్టాంప్ యాక్ట్ , ఏపీ యూనివర్శిటీల చట్టం, ఆర్జీయూకేటీ సవరణ బిల్లు, ఏపీ మార్కెట్ల సవరణ బిల్లుతో కూడిన సవరణ కోసం ఎనిమిది బిల్లులను ఇవాళ ప్రవేశ పెట్టారు.
అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, ఆర్థిక వృద్దిపై స్వల్ప కాలం పాటు చర్చ జరిగింది. విపక్ష సభ్యులు కూర్చుని చర్చలో పాల్గొనాలని స్పీకర్ తమ్మినేని సీతారం కోరినా టీడీపి ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకెళ్లారు.
ఆపై ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ తీర్మానం చేశారు.
ఇక సస్పెండ్(TDP MLAs Suspended) అయిన వారిలో నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, కె. అచ్చనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన రాజప్ప, పయ్యావుల కేశవ్ , భోగేశ్వర్ రావు, గద్దె రాంమోహన్ , రామకృష్ణ బాబు, రామానాయుడు, ఎం. రామరాజు, సత్య ప్రసాద్ , డోలా ఉన్నారు.
Also Read : వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యం – జగన్