Suspicious Containers: మహారాష్ట్ర తీరానికి కొట్టుకొచ్చిన అనుమానాస్పద కంటైనర్లు

మహారాష్ట్ర తీరానికి కొట్టుకొచ్చిన అనుమానాస్పద కంటైనర్లు

Suspicious Containers : మహారాష్ట్రలోని సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్‌లకు మూడు అనుమానాస్పద కంటైనర్లు (Suspicious Containers) కొట్టుకురావడంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని… అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అందులో ఏముందనే ? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనితో తీర గ్రామాలను అలర్ట్‌ చేసి… బీచ్‌ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్‌ చేపడుతున్నట్లు తెలిపారు.

Suspicious Containers in Maharashtra

సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా మారిందని… ఓ కంటైనర్‌ పాక్షికంగా మునిగిపోయిందని అధికారులు తెలిపారు. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డ్‌లు సమన్వయంతో పని చేస్తూ… కంటైనర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి షిప్పింగ్ లాగ్‌ లు, తీరప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఆగస్టులో ఒమన్‌ నుంచి వెళ్తున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారిపడ్డాయని… ప్రస్తుతం అవే కొట్టుకొచ్చినవి అయ్యుంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. సముద్ర తీరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ముట్టుకోవద్దని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులకు సూచించారు.

ఆగస్టులో ఒమన్‌ నుంచి వెళ్తున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లుసముద్రంలో జారిపడ్డాయి. కంటెయినర్లు అరేబియా సముద్రం గుండా మహారాష్ట్ర లోని ఒడ్డుకు కొట్టుకువచ్చే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కంటెయినర్లను లేదా సంబంధిత వస్తువులను గుర్తిస్తే భారత నావికాదళానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులు, గస్తీ బృందాలకు అధికారులు సూచించారు.

Also Read : Bihar Assembly Elections: బిహార్‌ ఎన్నికల ప్రచారానికి రోజుకు 20 హెలికాప్టర్లు ?

Leave A Reply

Your Email Id will not be published!