Suvendu Adhikari CM : మమతతో సువేందు ములాఖత్
చాన్నాళ్లకు కలుసుకున్న ఇద్దరు నేతలు
Suvendu Adhikari CM : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలు మరింత వేడెక్కిన తరుణంలో, మాటల తూటాలు పేలుతున్న సందర్భంలో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, మాజీ టీఎంసీ నాయకుడు సువేందు అధికారితో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) భేటీ అయ్యారు.
నిన్నటి దాకా సీఎం, సువేందు ఇద్దరూ నిన్నటి దాకా ఒక్కటిగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కంటే ముందు అధికారి గుడ్ బై చెప్పారు. మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. చాన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలుసు కోవడం చర్చనీయాంశంగా మారింది. సువేందు అధికారి మమతా బెనర్జీకి అనుంగు అనుచరుడిగా, సహాయకుడిగా పేరొందారు.
ఒక రకంగా చెప్పాలంటే సీఎంకు అన్నీ ఆయనే. సీఎం దీదీ శుక్రవారం సువేందు అధికారితో(Suvendu Adhikari) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021లో బీజేపీలో చేరారు. రాష్ట్ర అసెంబ్లీ లోని తన ఛాంబర్ కు సువేందు అధికారిని సీఎం ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు అగ్ని మిత్ర పాల్ , అశోక్ కుమార్ లాహిరి, మనోజ్ తిగ్గా కూడా ఉన్నారు. అసెంబ్లీ క్యాంపస్ లో ప్లాటినం జూబ్లీ స్మారక భవనం ప్రారంభోత్సవానికి ముందు ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇరు పార్టీలలో కలకలం రేపింది. ఈ సందర్భంగా దీదీతో మాట్లాడిన అనంతరం సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు.
మమతాపై తాను వ్యక్తిగతంగానే పోరాటం చేశాను. రాజకీయ, సైద్దాంతిక పోరాటమని పేర్కొన్నారు. అనంరతం సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ సువేందు అధికారిని తన సోదరుడు అంటూ ప్రశంసించారు.
Also Read : ‘బీఎల్ సంతోష్’ కు సంతోషం