Taiwan China Row : తైవాన్ జ‌ల‌సంధిపై చైనా దాడి

బ‌దులు తీర్చుకుంటామ‌ని వార్నింగ్

Taiwan China Row : ప్ర‌శాంతంగా ఉన్న తైవాన్ పై చైనా దాడి చేసేలా చేసిన ఘ‌న‌త అమెరికాకు ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం తైవాన్ భూభాగంపై త‌మ‌కే హ‌క్కు ఉందంటూ చైనా మొద‌టి నుంచీ చెబుతూ వ‌స్తోంది.

ఆ దేశంతో ఎవ‌రైనా స‌త్ సంబంధాలు పెట్టుకోవాల‌ని అనుకున్నా లేదా ప‌ర్య‌టించాల‌ని చూసినా లేదా కాలు మోపినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

కానీ చైనా చీఫ్ జిన్ పింగ్ చేసిన హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌ర్ చేసింది అమెరికా. ఆ దేశానికి చెందిన స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తాజాగా ఆసియా ఖండంలో ప‌ర్య‌టించింది. ఇందులో భాగంగా తైవాన్ ప్ర‌ధానితో భేటీ అయ్యింది.

ఆమె టోక్యోకు చేరుకున్న వెంట‌నే చైనా సైనిక విన్యాసాలు స్టార్ట్ చేసింది. ఆపై తైవాన్(Taiwan China Row) పై ఆర్థిక ఆంక్షలు విధించింది చైనా. ఇప్ప‌టికే బాలిస్టిక్ క్షిప‌ణ‌లతో దాడికి పాల్ప‌డిందంటూ తైవాన్ ఆరోపించింది.

త‌మ దేశానికి చెందిన జ‌ల సంధి చుట్టూ విమానాలు, నౌక‌లు, ఫైట‌ర్ జెట్ లు ప్ర‌యోగిస్తోదంటూ మండిప‌డింది. ఇంత జ‌రుగుతున్నా నిన్న‌టి దాకా చిలుక ప‌లుకులు ప‌లికిన అమెరికా నోరు మెద‌ప‌డం లేదు.

కావాల‌నే క‌య్యానికి కాలు దువ్వుతోందంటూ తైవాన్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంత‌ర్జాతీయ ఒప్పందాల‌ను పూర్తిగా చైనా ఉల్లంఘించిందంటూ ఆవేద‌న చెందింది తైవాన్.

దీంతో ఇరు దేశాల మ‌ధ్య పూర్తిగా యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే చైనా వైఖ‌రిని ప‌లు దేశాలు ఖండించాయి. యుఎన్ వెంట‌నే ఉప‌సంహ‌రించు కోవాల‌ని కోరింది.

Also Read : కాబూల్ లో ‘వియాన్’ పాక్ జ‌ర్న‌లిస్ట్ కిడ్నాప్

Leave A Reply

Your Email Id will not be published!