Governor Tamilsai : ట్రబుల్ షూటర్ తో తమిళిసై భేటీ
రాష్ట్రంలో పరిస్థితులపై నివేదిక
Governor Tamilsai : తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి ఇన్ ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Governor Tamilsai) ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారవు. ఈ మేరకు ఎప్పటి లాగే పూర్తి నివేదికను అందజేశారు.
మరో వైపు మత ఘర్షణలతో అట్టుడుకుతోంది హైదరాబాద్. బీజేపీకి చెందిన గోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ మహ్మద్ ప్రవక్తను అవమానించారంటూ ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు నిప్పులు చెరిగారు.
పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. మరో వైపు పరిస్థితి విషమించడంతో భారతీయ జనతా పార్టీ హై కమాండ్ ముందస్తుగా స్పందించింది.
రాజా సింగ్ ను పార్టీ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఈ సమయంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై సమీక్ష చేపట్టారు. ఎవరు లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించినా ఊరుకోవద్దంటూ హెచ్చరించారు.
ప్రస్తుత సమయంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పరమైన చర్చలు ఏమైనా చర్చకు వచ్చాయా లేక ఎప్పటి లాగానే నివేదిక మాత్రమే అందించేందుకు గవర్నర్ వెళ్లారా అన్నది తేలాల్సి ఉంది.
పనిలో పనిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ తో కూడా భేటీ కానున్నారు తమిళి సై.
Also Read : లా అండ్ ఆర్డర్ ముఖ్యం – కేసీఆర్