Tammineni Veerabhadram : కోరిన సీట్లు ఇవ్వక పోతే కటీఫ్
సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
Tammineni Veerabhadram : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వేళ ఇంకా పొత్తుల పంచాయితీకి తెర పడలేదు. నిన్నటి దాకా బీఆర్ఎస్ తో అంటకాగాయి వామపక్షాలు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావడంతో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ పార్టీతో సీట్ల బేరానికి దిగాయి. తాము కోరిన సీట్లను కేటాయించాలని పట్టు పడుతున్నాయి.
Tammineni Veerabhadram Comments Viral
మరో వైపు ఓడి పోయే సీట్లను కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు ఎరుపు నేతలు. ఒకప్పుడు విలువల కోసం , ప్రజా సమస్యల కోసం పోరాడే చరిత్ర ఉన్న ఈ పార్టీలు ఉన్నట్టుండి బూర్జూవా పార్టీలతో పొత్తు కోసం తహ తహ లాడుతున్నాయి.
ఎన్నికలంటేనే నోట్లు, ఓట్లు, సీట్లు అన్న చందంగా మారి పోయాయి. వీరి రాజకీయాలను చూసి జనం చీదరించు కుంటున్నారు. తాజాగా వామపక్షాలతో సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్ పార్టీ ఇంకా తర్జన భర్జనలు పడుతోంది.
రాష్ట్రంలో మొత్తం 119 సీట్లకు గాను 100 సీట్లను ప్రకటించింది పార్టీ. ఇంకా 19 సీట్లను ఖరారు చేయాల్సి ఉంది. వీటిలో సీపీఐ, సీపీఎం పార్టీలు తమకు కనీసం 10 సీట్లు కేటాయించాలని కోరుతున్నాయి. ఈ గొంతెమ్మ కోర్కెలను చూసి కాంగ్రెస్ విస్తు పోతోంది.
ఇదిలా ఉండగా కొత్త గూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలను వామపక్షాలకు కేటాయించే ఛాన్స్ లేక పోలేదు. అయితే మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోరుతోంది. వీటిని కేటాయించాలని లేక పోతే పొత్తు ఉండదంటూ డెడ్ లైన్ ప్రకటించారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram).
Also Read : IT Raids : కాంగ్రెస్..బీఆర్ఎస్ నేతలకు ఐటీ షాక్