Taneti Vanitha : కొవ్వూరు నుంచే బరిలో ఉంటా
లేదంటే పార్టీ మారే ప్రసక్తి లేదు
Taneti Vanitha : అమరావతి – ఏపీ హోం , విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దీనిపై సీరియస్ గా స్పందించారు.
Taneti Vanitha Comment
ఆరు నూరైనా సరే తాను కొవ్వూరు నుంచే బరిలో ఉంటానని ప్రకటించారు. ఒకవేళ టికెట్ రాక పోయినా బాధ పడనని చెప్పారు. అయితే పార్టీ మారే ప్రసక్తి లేదని, జగన్ రెడ్డి వెంట నడుస్తానని, ఆయన ఏది చెబితే అది చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా త్వరలో ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. సగం మంది సిట్టింగ్ లకు స్థాన చలనం కలుగుతుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం మహిళా సంక్షేమ శాఖను నిర్వహిస్తున్నారు తానేటి వనిత.
ఆమె 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2019లో హోం శాఖ బాధ్యతలు స్వీకరించింది. రెండో విడత పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చేపట్టిన కేబినెట్ లో కొలువు తీరింది. తానేటి వనిత(Taneti Vanitha) ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో 1975లో పుట్టారు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చదివారు. నల్లజర్ల లోని సహకార జూనియర్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేశారు తానేటి వనిత.
Also Read : MLC Vamsikrishna Srinivas : వైసీపీకి షాక్ ఎమ్మెల్సీ జంప్