CM Revanth Reddy : ఇక నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైద‌రాబాద్ – రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న సాగుతుంద‌న్నారు. గ‌తంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు దూరంగా పాల‌న సాగించింద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు బుధ‌వారం స‌చివాల‌యంలో అభ‌య హ‌స్తం పేరుతో ఆరు గ్యారెంటీల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను విడుదల చేశారు సీఎం.

CM Revanth Reddy Comment

ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబంపై, మాజీ మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు చేసిన అవినీతి, అక్ర‌మాల గురించి ఏక‌రువు పెట్టారు. ప్ర‌జ‌ల‌కు జ‌న రంజ‌క పాల‌న అందించ‌డం త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి కీల‌క సూచ‌న చేశారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గ్రామ పంచాయ‌తీల‌లో కూడా అప్లికేష‌న్స్ ఇవ్వ వ‌చ్చ‌ని తెలిపారు. గ్రామ స‌భ‌ల్లో ఇవ్వ‌క పోతే పంచాయ‌తీల‌లో ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. గ్రామ స‌భ‌ల ద్వారా కూడా ఇచ్చేందుకు వీలు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఎవ‌రి కోసం ఎదురు చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు రేవంత్ రెడ్డి. ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వ‌మే మీ వ‌ద్ద‌కు వ‌స్తుంద‌ని చెప్పారు సీఎం. మారు మూలలో ఉన్న గ్రామాల వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. తండాలు, పేద‌ల వ‌ద్ద‌కు పాల‌న అందించేలా కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు .

Also Read : Taneti Vanitha : కొవ్వూరు నుంచే బ‌రిలో ఉంటా

Leave A Reply

Your Email Id will not be published!