Salaar Box Office : స‌లార్ వ‌సూళ్ల ఊచ‌కోత

రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి ఎంట్రీ

Salaar Box Office : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , ల‌వ్లీ బ్యూటీ శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. ఊహించ‌ని రీతిలో కాసులు కొల్ల‌గొడుతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతూ దూసుకు పోతోంది. గ‌తంలో రికార్డులు బ్రేక్ చేసిన సినిమాల వ‌సూళ్ల‌ను తిర‌గ రాస్తోంది స‌లార్ చిత్రం. ఇక టేకింగ్ లో మేకింగ్ లో టాప్ లెవ‌ల్లో సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.

Salaar Box Office Collections

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా స‌లార్(Salaar) ఆశించిన దానికంటే ఎక్కువ‌గా కాసులు కొల్ల‌గొడుతోంది. రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది ప్ర‌శాంత్ నీల్ మూవీ. ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహు బ‌ళి మూవీ రికార్డుల‌ను దాటేందుకు వెళుతోంది స‌లార్.

డార్లింగ్ ప్ర‌భాస్ మేనియా సినిమాకు కాసులు కురిపించేలా చేసింది. ఇక వ‌సూళ్ల ప‌రంగా చూస్తే తొలి రోజు రూ. 176.52 కోట్లు కొల్ల‌గొట్టింది. 2వ రోజు రూ. 101.39 కోట్లు, 3వ రోజు 95.24 కోట్లు, 4వ రోజు రూ. 76.91 కోట్లు, 5వ రోజు రూ. 40.17 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా స‌లార్ చిత్రానికి సంబంధించి రూ. 490.23 కోట్లు సాధించింది.

మ‌రో వైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , తాప్సీ క‌లిసి న‌టించిన డుంకీ సైతం ఇదే స్థాయిలో వ‌సూలు చేసింది. రూ. 270 కోట్లు సాధించింది ఆరు రోజులలో.

Also Read : CM Revanth Reddy : ఇక నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న

Leave A Reply

Your Email Id will not be published!