Tantric Ritual: కుక్కల రక్తంతో యువతి క్షుద్ర పూజలు

కుక్కల రక్తంతో యువతి క్షుద్ర పూజలు

Tantric Ritual : క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు (Bangaluru) మహదేవపుర చిన్నప్పలేఔట్‌లోని అపార్టుమెంట్‌లో ఉంటోంది. త్రిపర్ణ పైక్‌ అనే మహిళ 4 లేబ్రడార్‌ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది. ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి.

Tantric Ritual in Bangaluru

చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల (Tantric Ritual) దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

గోడకి కట్టివేసిన మరో రెండు కుక్కలని BMP ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మహదేవ్ పుర పోలీస్ స్టేషన్‌లో జంతు హింస, సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. ఈ భయంకరమైన పనికి క్షుద్రపూజ నేపథ్యమా లేక నిందితురాలి మానసిక స్థితా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందినామె అని, బెంగళూరులో నివసిస్తుందని చెబుతున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం జంతువుల హక్కులు, పెంపుడు జంతువుల భద్రత గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనేకమంది జంతు ప్రేమికులు, సంస్థలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : Census: 2026 ఏప్రిల్ 1 నుండి జనాభా గణన షురూ

Leave A Reply

Your Email Id will not be published!