Tarun Chug Kavitha : ఎమ్మెల్సీ క‌విత‌కు మిన‌హాయింపు ఉండ‌దు

ఇక‌నైనా నిజాలు చెపితే బెట‌ర్ అన్న త‌రుణ్ చుగ్

Tarun Chug Kavitha : భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్(Tarun Chug) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో పాటు ఆప్ ప్ర‌భుత్వం పాలు పంచుకుంద‌ని ఆరోపించారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు పార్టీల‌తో సంబంధం ఉండ‌ద‌న్నారు.

ఆ విష‌యం తెలుసుకుని మాట్లాడితే బెట‌ర్ అన్నారు. త‌ప్పు చేసింది క‌నుక‌నే క‌విత ఫోన్ల‌ను ధ్వంసం చేసింద‌న్నారు. ఇప్ప‌టికే ఈడీ ఏమేం చేసిందో ఎవ‌రెవ‌రు పాల్గొన్నారో, ఎలా మ‌ద్యం సిండికేట్ గా ఏర్ప‌డి వ్యాపారాలు చేశారో స్ప‌ష్టం చేసింద‌ని తాను ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌న్నారు.

వాస్త‌వాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు. శ‌నివారం త‌రుణ్ చుగ్(Tarun Chug) మీడియాతో మాట్లాడారు. త‌మ‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో కానీ లేదా సీఎం ఫ్యామిలీని కాని టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రు కావాల‌ని అనుకుంటే వారికి ఓట్లు వేస్తార‌ని , యుద్దం వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి అస్త్రాలు వాడాలో త‌మ‌కు తెలుస‌న్నారు.

సీబీఐ ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసింద‌ని, దీనికి సంబంధించి బీజేపీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. తాను నిర్దోషిన‌ని క‌విత నిరూపించు కోవాల‌ని స‌వాల్ విసిరారు త‌రుణ్ చుగ్. డిసెంబ‌ర్ 6న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ముందు వాస్త‌వాలు చెపితే బాగుంటుంద‌ని సూచించారు త‌రుణ్ చుగ్. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ క‌విత ప‌దే ప‌దే ఢిల్లీకి ఎందుకు వ‌చ్చారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

చ‌ట్టం ముందు సీఎం కూతురు అని ఎలాంటి ప్రేమ ఉండ‌ద‌న్నారు. సామాన్యుడైనా సీఎం అయినా ఒక్క‌టేన‌ని ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు.

Also Read : సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ క‌విత భేటీ

Leave A Reply

Your Email Id will not be published!