Tarun Chugh KCR : ఖలేజా ఉంటే అసెంబ్లీ రద్దు చేయ్
కేసీఆర్ కు తరుణ్ ఛుగ్ సవాల్
Tarun Chugh KCR : భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీపై, ప్రధాని మోదీ, మంత్రులపై నోరు పారేసుకున్న సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ఖలేజా ఉంటే వెంటనే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బీజేపీ చేపట్టిన సభను చూసి కేసీఆర్ భయంతో వణుకు తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నామని చెప్పారు తరుణ్ ఛుగ్. డేట్ ఫిక్స్ చేస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
తాను ఓడి పోతామేననే భయం సీఎంకు పట్టుకుందన్నారు. మోదీ పేరు వింటేనే వణుకుతున్నాడని చెప్పారు. జాతీయ మీడియాతో తరుణ్ ఛుగ్ మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్(Tarun Chugh KCR) మరిచి పోయాడని ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు జమ చేసేందుకే పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ బల పడుతోంది. దీనిని చూసి తట్టుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఫైర్ అయ్యారు.
సీఎం స్థాయికి తగ్గట్టు ఆయన మాట తీరు ఉండడం లేదన్నారు. ప్రజలు ఆయన వాడుతున్న భాషను చూసి జడుసు కుంటున్నారని చెప్పారు తరుణ్ ఛుగ్.
రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతి, రాచరిక పాలనకు బొంద పెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు తరుణ్ ఛుగ్. ఇక జైలు పాలు కాక తప్పదన్నారు. ప్రధాని మోదీ, సీఎం యోగి, కేంద్ర మంత్రి గోయల్ ను దూషించడాన్ని తప్పు పట్టారు.
Also Read : కురుస్తున్న వర్షాలు తప్పని కష్టాలు