TATA Sons Chairman : సీఎం జగన్ తో టాటా సన్ చైర్మన్ భేటీ
ఏపీలో పెట్టుబడులపై విస్తృత చర్చలు
TATA Sons Chairman : ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నటరాజన్(TATA Sons Chairman) ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి సహాయ, సహకారాలు అందించేందుకైనా ప్రభుత్వ పరంగా సిద్దంగా ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రశేఖరన్ నటరాజన్ కు హామీ ఇచ్చారు.
పారిశ్రామిక రంగానికి సంబంధించి రాష్ట్రంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను కూడా ఆయన వివరించారు. రాష్ట్రంలో సుశిక్షుతులైన మానవ వనరులు, వ్యాపార నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు సీఎం జగన్ రెడ్డి(CM Jagan).
ఈ కీలక సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కరికల్ వలెవాన్ , ఏపీ ఈడీబీ సిఇఓ జావాది సుబ్రమణ్యం , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ది చెందుతోంది. ఉపాధిని సృష్టించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే కాకుండా దేశంలో ఈఓడీబీ చార్టులలో అగ్ర స్థానంలో ఉంది ఏపీ రాష్ట్రం.
అంతే కాకుండా దేశ వ్యాప్తంగా 11.74 శాతం వృద్ది రేటును సాధించింది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సాదర స్వాగతం పలుకుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు