TDP Butchaiah Choudhary : వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై విరుచుకుపడ్డ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల
జగన్ డ్రగ్స్ అమ్ముతున్నారని, ఆ డబ్బును ఎన్నికలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు
TDP Butchaiah Choudhary : ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారని సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గంజాయి చీడ పాకుతుందన్నారు. పోలీసుల దృష్టి నేరగాళ్లపై కాకుండా ప్రతిపక్షాలపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం వస్తేగాని స్థానిక ప్రభుత్వాలు మేల్కోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందన్నారు.
TDP Butchaiah Choudhary Slams MP Bharat
జగన్ డ్రగ్స్ అమ్ముతున్నారని, ఆ డబ్బును ఎన్నికలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది చిన్న సమస్య కాదు, పెద్ద కుంభకోణం. సమగ్ర విచారణ జరపాలి. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమ అప్పుల్లో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మార్గాని భరత్ ఒక పిచ్చివాడు అని చెప్పారు. ఇలా మాట్లాడే వారికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. “నిన్నటి వరకూ గంజాయి స్మగ్లర్ చోటుని పక్కన తిప్పుకుంది నువ్వుకాదా ? నీ గంజాయి బ్యాచ్ ని తెచ్చి నామీద మోపాలని చుస్తే… గుడ్డలూడదీస్తా కబడ్ధార్” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
Also Read : Annamalai BJP : కోయింబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి అన్నామలై, సౌత్ చెన్నై నుంచి తమిళిసై