TDP Jana Sena : సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ ఫోక‌స్

సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న బాబు

TDP Jana Sena : అమ‌రావ‌తి – తెలంగాణ‌లో ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. ఇక మిగిలింది ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం. వ‌చ్చే ఏడాది 2024లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి నుంచే టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఫోక‌స్ పెట్టారు. ఆయ‌న‌తో పాటు త‌న‌యుడు నారా లోకేష్ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. తను ఇటీవ‌లే 53 రోజుల పాటు స్కిల్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చారు. ప‌ర్మినెంట్ బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

TDP Jana Sena Seats Clearance

బ‌య‌ట‌కు రాక ముందే జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రు క‌లిసినా క‌ల‌వ‌క పోయినా త‌మ పార్టీ టీడీపీ(TDP) క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా ఇరువురు నేత‌లు ప‌లుమార్లు భేటీ అయ్యారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరుతున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇవ్వాల‌నే దానిపై ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాబుతో భేటీ అయ్యారు.

ఆయ‌న‌కు నైతిక మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చారు. విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో పోటీ చేయ‌కుండా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇక జ‌న‌సేన పార్టీ బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం చేసినా ఓట్లు రాలేదు. మొత్తంగా ఏపీలో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈమేర‌కు సీట్ల స‌ర్దుబాటుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

Also Read : Bhatti Vikramarka : సంప‌దను సృష్టిస్తాం పంపిణీ చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!