TDP Leader Swamy Das: వైసీపీలో చేరిన టిడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ !

వైసీపీలో చేరిన టిడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ !

TDP Leader Swamy Das: అధికార వైసీపీ ఎన్నికల అభ్యర్ధులను ఖరారు చేస్తున్న వేళ ఏపిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీను వీడి వైసీపీలో చేరి 24 గంటలు కాకముందే… తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ తెలుగుదేశం పార్టీకు షాక్ ఇచ్చారు. సిఎం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకుని వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్(Swamy Das) వెంట ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.

TDP Leader Swamy Das Joined in YSRCP

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీను వీడిన తరువాత… ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. నల్లగట్ల స్వామిదాస్‌ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేశినేని నానితో సన్నిహిత సంబంధాలు ఉన్న స్వామిదాస్… ఆయన బాటలోనే వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని నానిని… విజయవాడ ఎంపీగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అలాగే తిరువూరు అసెంబ్లీ స్థానం స్వామిదాస్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల తన ఎంపీ పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని… తన రాజీనామాలు ఆమోదం పొందిన తరువాత సిఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి ధీటుగా కేశినేని నాని వెంట టీడీపీ నాయకులు ఎవరూ వెళ్ళరంటూ పలువురు నాయకులు ప్రకటనలు చేసారు. అయితే నాని జోస్యం చెప్పి 24 గంటలు కాకముందే… మూడో జాబితాలో అతను సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ను వైసీపీలో చేర్చడంతో కీలకపాత్ర పోషించారు. దీనితో విజయవాడ రాజకీయాలు రోజుకో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : YSRCP Third List Released: వైసీపీ మూడో జాబితా విడుదల ! 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలతో మూడో జాబితా !

Leave A Reply

Your Email Id will not be published!