Helicopter Crash: ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్ మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి
ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్ మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి
ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా… ఒక వ్యక్తి గాయపడ్డారు. మృతి చెందిన వారిలో అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఉన్నారు. వేదవతి భర్త భాస్కర్ గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన రుషికేశ్ ఎయిమ్స్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీనితో టిడిపి ఎంపీ లక్ష్మి నారాయణ హుటాహుటీన రుషికేశ్ బయలుదేరారు.
వేదవతి మృతికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం
ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏపీకి చెందిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి మృతిపై ఏపీ పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేసారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు మృతుల కుటుంబాలకు మంత్రి దుర్గేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రిషికేష్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మృతురాలు వేదవతి కుమారి భర్త భాస్కర్ కు మెరుగైన వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ అధికారులకు ఆదేశించారు.