Team India 2023 : ఆడితే ఓకే లేదంటే వేటే
ఆటగాళ్ల భవితవ్యంపై సందిగ్ధం
Team India 2023 : అన్ని ఫార్మాట్ లో బలంగా ఉన్న ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు , మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సీరీస్ కీలకం కానుంది. ఇప్పటికే భారత్ లో పర్యటించిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో ఆడిన టీమిండియా వన్డే, టీ20 సీరీస్ లను చేజిక్కించుకుంది(Team India 2023). జోరు మీదుంది. మరో వైపు ఆసిస్ సైతం సత్తా చాటేందుకు సర్వ శక్తులు కేంద్రీకరించనుంది.
అలెన్ బోర్డర్ సునీల్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సీరీస్ లో భాగంగా ఫిబ్రవరి 9న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఒకవేళ ఇండియా విజయం సాధిస్తే ఫైనల్ కు చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బెంగళూరు లోని క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో భారత జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా సాధనలో మునిగి పోయారు. వన్డే, టెస్టు ఫార్మాట్ లకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా టీ20కి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.
ఇక భారత జట్టు విషయానికి వస్తే పలువురు ఆటగాళ్లకు ఈ సీరీస్ అత్యంత కీలకం కానుంది. ప్రతిభ కనబరిస్తేనే చోటు ఉండే ఛాన్స్ ఉంది. లేక పోతే భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది.
వీరిలో రవిచంద్రన్ అశ్విన్ , జయదేవ్ ఉనాద్కత్ , జస్ప్రీత్ బుమ్రా , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ ల కు ఈ సీరీస్ అగ్ని పరీక్షగా మారనుంది. ఇక ఆసిస్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు.
Also Read : ఆసిస్ తో భారత్ అమీ తుమీకి రెడీ