IND vs SL 2nd Test : బెంగళూరు వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టు అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. పింక్ బాల్ అనూహ్యంగా గింగిరాలు తిరుగుతోంది. ఊహించని రీతిలో బౌన్స్ అవుతోంది.
ఈ తరుణంలో టాస్ గెలిచిన టీమిండియా(IND vs SL 2nd Test) కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ తరుణంలో 126 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
కష్ట కాలంలో బరిలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేయక పోయినా గౌరవ ప్రదమైన స్కోర్ చేశాడు. దీంతో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
అయ్యర్ 98 బంతులు ఆడి 92 పరుగులు చేశాడు. 10 ఫోర్లు 4 సిక్స్ లతో హోరెత్తించాడు. శ్రేయస్ కు తోడుగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 26 బంతులు ఆడి 39 రన్స్ చేస్తే, హనుమ విహారి 31 పరుగులు చేసి పరువు పోకుండా కాపాడారు.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక అప్పుడు 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ జట్టు కూడా కష్టాలలో పడింది. టీమిండియా పేసర్లు స్వింగ్ తో హోరెత్తించారు.
దీనిని బట్టి చూస్తే మూడు రోజుల్లోపే ముగిసేలా కనిపిస్తోంది. లంక జట్టులో 85 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్సర్లు 43 రన్స్ చేశాడు. ఇంకా శ్రీలంక 166 పరుగులు వెనుకబడి ఉంది.
ఇక జట్టు పరంగా చూస్తే మయాంక్ 4 పరుగులు చేస్తే రోహిత్ శర్మ 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. కోహ్లీ 23 పరుగులు చేసి నిరాశ పరిచాడు. ఫస్ట్ టెస్టులో మనోడు 45 పరుగులు చేశాడు. ఇవాళ రెండో రోజు మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి.
Also Read : ఝులన్ గోస్వామి సంచలనం