IND vs SL 1st Test : లంకేయుల‌తో టీమిండియా పోరు

అరుదైన ఘ‌న‌త దిశ‌గా విరాట్ కోహ్లీ

IND vs SL 1st Test : వ‌రుస విజ‌యాల‌తో రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ లోని భార‌త క్రికెట్ జ‌ట్టు జోరు మీదుంది. రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా మొహాలీ వేదిక‌గా శ్రీ‌లంక‌తో ఫ‌స్ట్ టెస్టు ప్రారంభం కానుంది.

ఇరు జ‌ట్ల‌లో టీమిండియానే అన్ని రంగాల‌లో బ‌లంగా ఉంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. యువ ర‌క్తంతో ఉర‌క‌లు వేస్తోంది.

మ‌రో వైపు శ్రీ‌లంక సైతం ఎలాగైనా పోయిన ప‌రువు కాపాడు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేసేందుకు స‌న్న‌ద్ద‌మైంది. ఇక గ‌ణాంకాల ప‌రంగా చూస్తే శ్రీ‌లంక ఇండియాలో 20 టెస్టులు ఆడితో అందులో 11 మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. 9 టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఒక్క‌టి కూడా గెల‌వ‌లేక చేతులెత్తేసింది. ఎటు చూసినా టీమిండియాదే(IND vs SL 1st Test) పై చేయి సాధించేలా క‌నిపిస్తోంది. ఇక భార‌త జ‌ట్టుకు 35వ టెస్టు కెప్టెన్ గా ఇదే స్టేడియంలో బ‌రిలోకి దిగుతున్నాడు రోహిత్ శ‌ర్మ‌.

మ‌రో వైపు సుదీర్ఘ కాలం పాటు ఎన‌లేని విజ‌యాలు స‌మ‌కూర్చి పెట్టిన డైన‌మిక్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ 100వ‌ది కావ‌డం విశేషం.

విచిత్రం ఏమిటంటే నిన్న‌టి దాకా కీల‌క విజ‌యాల‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ వ‌చ్చిన అజింక్యా ర‌హానే, పుజారాలు లేకుండానే బ‌రిలోకి దిగుతోంది భార‌త్.

ప్ర‌పంచ టెస్టు క్రికెట్ లో ఏ జ‌ట్టు అయినా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో ఎంట‌ర్ కావాలంటే క‌నీసం 9 టెస్టు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది.

ప‌లు మార్పులు చేసేందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మొగ్గు చూపారు. ప్ర‌తి ఒక్క‌రు కోహ్లీ 100వ టెస్టులో 100 ప‌రుగులు చేయాల‌ని కోరుతున్నారు.

Also Read : ర‌హానే..పుజారాపై రోహిత్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!