Team India Loss : తేలి పోయారు తల వంచారు
ఐపీఎల్ మత్తు వదలని ప్లేయర్లు
Team India Loss : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఇంగ్లండ్ లోని ఓవెల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టును ఓడించింది(Team India loss). అంతా అతిరథ మహారథులే. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో దంచి కొట్టిన వాళ్లు. కానీ విదేశీ మైదానంలో తేలి పోయారు. కేవలం ఆటను ప్రొఫెషనల్ గా చూసి ఆడే ఆటగాళ్లలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటారు. వాళ్లు దేనినీ తేలికగా తీసుకోరు. అంతే కాదు ఓటమిని కూడా ఒప్పుకోరు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ భారత జట్టు లోని బలహీనతలను సొమ్ము చేసుకుంది. ఆపై పరుగుల వరద పారించింది. తొలి సెషన్ లో బ్యాటర్లను కట్టడి చేసిన బౌలర్లకు చుక్కలు చూపించాడు డేవిడ్ వార్నర్ . చేసింది తక్కువ పరుగులే అయినా వికెట్లు పడకుండా చూశాడు. ఆ తర్వాత వచ్చిన హేడ్ , స్టీవ్ స్మిత్ దుమ్ము రేపారు. భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్ పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచింది. పరువు పోకుండా కాపాడారు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా , అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్. ఆ మాత్రం స్కోర్ చేసింది. ఇక 444 పరుగుల భారీ టార్గెట్ భారత్ ముందు ఉంచింది ఆస్ట్రేలియా. ఛాంపియన్ గా నిలవాలంటే నిలదొక్కుకోవాలి. కానీ వెంట వెంటనే కెప్టెన్, ఓపెనర్ వెనుదిరిగారు. మరోసారి అజింక్యా రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో కాపాడాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశ పరిచిన కోహ్లీ 46 రన్స్ చేశాడు. చివరకు 209 పరుగుల తేడాతో ఓటమి పాలై ఇంటి బాట పట్టారు.
Also Read : IND vs AUS WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఆసిస్