#AjinkyaRahane : అజింక్యా రహానే కన్నీటి పర్యంతం
ఇది కల కాదు అసాధారణ విజయం
Ajinkya Rahane : క్రికెట్ ఆటలో అరుదైన క్షణాలకు గబ్బా స్టేడియం వేదికైంది. 32 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు మంగళం పాడింది టీమిండియా. ఓ వైపు కోవిడ్ -19 భయం, ఇంకో వైపు వరుసగా ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడటం. ఇద్దరి ఆటగాళ్లు తమ తండ్రులను కోల్పోయారు. 36 పరుగులకే ఆలౌట్ కావడం లాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత జట్టు అసాధారణమైన పట్టుదలను కనబరిచింది. నిజానికి నేను ఎప్పుడూ కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తా. కానీ ఇపుడు మీ ముందు మాట్లాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈ విజయం అసాధారణం అంటూ భావోద్వేగానికి గురయ్యాడు టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane).
ఆసిస్ పై నాలుగో టెస్టు గెలిచాక. టెస్ట్ సిరీస్ ట్రోఫీ అందుకున్న అనంతరం మాట్లాడాడు. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్ విజయాన్ని అభివర్ణించేందుకు నా దగ్గర మాటలు లేవు. అడిలైడ్ టెస్ట్ తర్వాత ప్రతి ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడాడు. ఈ గెలుపులో ప్రతి ప్లేయర్ కూ భాగస్వామ్యం ఉంది.
ముఖ్యంగా రిషభ్, నటరాజన్, ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ , సిరాజ్ మ్యాజిక్ చేశారు. పూజారా కష్ట కాలంలో నిలబడ్డాడడు. మరో వైపు కోచ్ రవిశాస్త్రి సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టు(Ajinkya Rahane) చరిత్రలోనే ఈ సిరీస్ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా ఎదుర్కొని నిలబడ్డారు.
ఇక ఈ సిరీస్ లో బౌలింగ్ విభాగంలో సిరాజ్ 13 వికెట్లు, అశ్విన్ 12 వికెట్లు, జడేజా 7 వికెట్లు, ఠాకూర్ 7 వికెట్లు, బుమ్రా 11 వికెట్లు, ఉమేష్ యాదవ్ 4 వికెట్లతో రాణించారు. పరుగుల విషయానికి వస్తే రిషభ్ పంత్ 274 , శుభమన్ గిల్ 259, పుజారా 271, రోహిత్ శర్మ 129, రహానే 268 పరుగులు చేసి జట్టులో కీలక భాగస్వాములుగా ఉన్నారు.
No comment allowed please